జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో ఉత్సాహం పెరుగుతోంది

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో ఉత్సాహం పెరుగుతోంది

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ప్రముఖ నాయకుల ప్రచారం

కామారెడ్డి జిల్లా ప్రతినిధిప్రశ్న ఆయుధం నవంబర్6 

హైదరాబాద్‌, 

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా ప్రముఖ నేతలు ముందుకు వచ్చారు. ప్రభుత్వ సలహాదారులు, మాజీ మంత్రి మొహమ్మద్ అలీ షబ్బీర్, బొరబండ కార్పొరేటర్ బాబ్ ఫాసియోద్దిన్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు మరియు మాజీ మున్సిపల్‌ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్ రావు, మాజీ కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్ తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జూబ్లీహిల్స్‌ ప్రజల అభివృద్ధి కోసం నవీన్ యాదవ్ గారి విజయం కీలకం అని పేర్కొన్నారు. అభివృద్ధి పథంలో జూబ్లీహిల్స్‌ను ముందుకు తీసుకువెళ్లాలంటే కాంగ్రెస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment