కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు గుండు సున్నా
తెలంగాణ పై కేంద్రం వివక్ష
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి లైని రమేశ్
ప్రశ్న ఆయుధం 24జులై గాంధారి :
ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి రాష్ట్రానికి నిధులు తేలేక పొయారు….
తెలంగాణ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు మొండి చేయి చూపారని రాష్ట్రానికి పెద్దగా నిధులు కేటాయించక పోవడం పై కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి లైని రమేశ్ తీవ్రస్థాయిలోద్వజమెత్తారు
సీ యం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీ యం భట్టి విక్రమార్క డిల్లీ వెళ్ళి ప్రధాని మోడీ ని నిధులు
కేటాయించాలని అడిగినా మోడీ సర్కార్ తెలంగాణ పై దయ చూపలేదన్నారు …తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంభిస్తుందని బడ్జెట్ లో రాష్ట్ర ప్రాజెక్టులకుమొండిచేయిచూపిందని …
రాష్ట్రం లో ఎనిమిది మంది బి జే పి యం పి లు ఉన్నా తెలంగాణ కు బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం పై ఎందుకు నోరు మెదపడం లేదని అన్నారు
తెలంగాణ పై బిజెపి యం పి లకు ప్రేమ ఉంటే కేంద్రం తో కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తేవాలని కోరారు లేకపోతే రాజీనామా చేయాలన్నారు