సామాజిక అంశాలపై విద్యార్థులకు విస్తృత అవగాహన

సామాజిక అంశాలపై విద్యార్థులకు విస్తృత అవగాహన

 

 

ఎల్లారెడ్డి మోడల్ & జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా డిసెంబర్ 01

 

కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ M. రాజేష్ చంద్ర IPS ఆదేశాల మేరకు, జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మోడల్ & జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 

ఈ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి సబ్‌ ఇన్స్పెక్టర్ మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా, విద్యార్థులకు బాల్యవివాహాలు, ప్రేమలో మోసాలు, మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలు–పిల్లలపై నేరాలు వంటి సామాజిక సమస్యలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.

 

సైబర్ నేరాల నివారణ సూచనలు

టోల్ ఫ్రీ నెంబరు 1930 (సైబర్ హెల్ప్‌లైన్) గురించి వివరించారు.

అత్యవసర సమయంలో 100 / డయల్ 100 ఉపయోగించాలన్నారు.

ఎల్లారెడ్డి SHE టీమ్ సభ్యులు WPC సుప్రజ విద్యార్థులకు అవగాహన కల్పించి, తమ సంప్రదింపు నెంబరు 8712686094 ను అందించారు.

 

 

రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ

డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని

సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపవద్దని ,మాదక ద్రవ్యాలు యువతను పెడదోవ పట్టిస్తాయని వివరించారు.

 

 

సోషల్ మీడియా జాగ్రత్తలు వివరిస్తూ విద్యార్థులు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

 

పోలీస్ కళాబృందం ప్రదర్శనలో భాగంగా హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ U. శేషారావు, PCs ప్రభాకర్, సాయిలు పాటలు, మాటల రూపంలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చక్కటి ప్రదర్శనతో అవగాహన కల్పించారు.

 

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గాంధీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment