గాంధారి పంచాయతీ సర్పంచ్ పదవికి మమ్మాయి రేణుక యాదవ్ నామినేషన్ దాఖలు
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 1 కామరెడ్డి జిల్లా గాంధారి
గాంధారి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి అభ్యర్థిగా నిలుస్తున్న మమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్ ఈ రోజు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ సందర్భంగా ఆమెతో పాటు స్థానిక మహిళలు, యువత, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో చేరి ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. అధికారులు నామినేషన్ పత్రాలను పరిశీలించి స్వీకరించగా, స్థానికంగా ఎన్నికల వేడి మరింతగా పెరిగింది. పంచాయతీ ఎన్నికలపై గ్రామ ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది