గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

ప్రతి దశలో నిబద్ధతతో పనిచేయాలి :

ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 2

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను సమీక్షించేందుకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా పోలీస్ కమిషనర్లు, SPలు సమావేశంలో పాల్గొన్నారు. సాధారణ పరిశీలకులు సత్యనారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్ తదితర అధికారులు పాల్గొని జిల్లాలో చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు. ఎన్నికల కమిషనర్ నామినేషన్, స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, లెక్కింపు ప్రక్రియలపై కీలక సూచనలు చేశారు. సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాలను గుర్తించి తగిన పోలీస్ బందోబస్తు, రూట్ మ్యాప్స్, రాండమ్ విధుల నియామకం చేపట్టాలని ఆదేశించారు. ప్రవర్తనా నియమావళి అమలు, సోషల్ మీడియా మానిటరింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ జారీపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పలు మార్గదర్శకాలు జారీ చేశారు. సర్వీస్ ఓటర్లు, ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్‌ పేపర్లను వేగంగా పంపించాలని, ఫారం–XX, కవర్లు, facsimile స్టాంపులు ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. “పోస్టల్ బ్యాలెట్ జారీ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరుగకూడదు. సర్వీస్ ఓటర్ల ఓటు హక్కు పరిరక్షణ అత్యంత ప్రధానం” అని కలెక్టర్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment