గూడెం సర్పంచ్ రేసులో మోతె యాదగిరి గౌడ్
గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు
– ప్రజావేదికపై అభిలాషలు ప్రకటించిన అభ్యర్థి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 4
కామారెడ్డి జిల్లా గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి మోత యాదగిరి గౌడ్ బరిలో నిలిచారు. గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం, త్రాగునీటి సమస్యల పరిష్కారం, రహదారి సౌకర్యాల మెరుగుదల తమ ప్రథమ కర్తవ్యమని ఆయన తెలిపారు. గ్రామంలో యువత, రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపుదిద్దనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆశలు, అభిలాషలకు అనుగుణంగా పనిచేసి గూడెంను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని యాదగిరి గౌడ్ స్పష్టం చేశారు.