డిజీపీని మర్యాదపూర్వకంగా కలసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

డిజీపీని మర్యాదపూర్వకంగా కలసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

పూలమొక్క అందజేత 

– పోలీసు శాఖ పనితీరు, జిల్లా అభివృద్ధిపై చర్చ

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 4 

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం రాష్ట్ర పోలీస్ కార్యాలయంలో డిజీపీ బి. శివధర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమొక్కను అందజేశారు. జిల్లా శాంతిభద్రతల స్థితిగతులు, పోలీసు శాఖలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వ్యవస్థ బలోపేతంపై ఇద్దరూ చర్చించారు. ప్రజా భద్రత, చట్టవ్యవస్థ మెరుగుదలకు సంబంధించిన పలు అంశాలను డిజీపీ సమీక్షించినట్లు తెలుస్తోంది. జిల్లాలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment