శివార్ వెంకటాపూర్ గ్రామాన్ని కలెక్టర్ , సిపి సందర్శించాలి
కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బక్కేల్లి బాలకిషన్
మర్కుక్ ఆగస్టు 28 ప్రశ్న ఆయుధం :
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని శివారు వెంకటాపూర్ గ్రామంలో దుర్గమ్మ పండగ సందర్భంగా దళితులను బోనాలు తీయకుండా అడ్డుకున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ చేయాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బక్కేల్లి బాలకిషన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామాన్ని సందర్శించి మాట్లాడుతూ గత నాలుగు ఐదు రోజుల నుంచి సంఘటన జరిగిన ఇంతవరకు ఏసీపీ సందర్శించలేదని అలాగే తాసిల్దార్ ఆర్డీవో గ్రామానికి సంబంధించి సందడించలేదని అన్నారు. ఇప్పటికైనా ఈ గ్రామాన్ని కలెక్టర్ సిపి వెంటనే సందర్శించి గ్రామంలో కుల కులరక్కసినీ రూపుమాపే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి జగదేవపూర్ మండలంలో దళితులపై కులవ్యక్షత కొనసాగుతుందని గతంలో తిమ్మాపూర్ లో, చాట్లపల్లిలో, ఇటిక్యాలలో చాలా గ్రామాలలో కులవ్యుక్షత కొనసాగుతున్న రెవెన్యూ సిబ్బంది గాని పోలీసు యంత్రంగానే కులరక్కసిని రూపుమాపే చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్ననారు అని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈనెల 30వ తారీకు పౌర హక్కుల దినాన్ని మండల కేంద్రాలలో జరపాలని కోరారు. అలాగే శివారు వెంకటాపూర్ గ్రామాన్ని పౌర హక్కుల దినం సందర్భంగా సహాబంతి భోజనాలు ఏర్పాటు చేసి అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరాటి కృష్ణమూర్తి, డివిజన్ నాయకులు డివిజన్ నాయకులు వెంకటేష్, మర్కుక్ మండల అధ్యక్షులు పొట్టొల్ల దాసు, గ్రామస్తులు ఎల్లమ్మ, మల్లమ్మ, కిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు.