గుండె ఆపరేషన్‌కు ₹2.50 లక్షల ఎల్‌ఓసీ అందించిన: గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

గుండె ఆపరేషన్‌కు ₹2.50 లక్షల ఎల్‌ఓసీ అందించిన: గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డిలో టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సేవా మనసు

కామారెడ్డి జిల్లా డిసెంబరు 18 (ప్రశ్న ఆయుధం):

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు వడ్లూరు గ్రామానికి చెందిన షేక్ వన్నూర్ గత మూడు నెలలుగా గుండె నొప్పితో బాధపడుతూ చికిత్స అవసరమైన పరిస్థితిలో ఉన్న విషయం టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. గుండె ఆపరేషన్ నిమిత్తం రూ.2,50,000 విలువైన ఎల్‌ఓసీ చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ చెక్కును 1వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ గడ్డ మీది మహేష్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేద కుటుంబానికి అండగా నిలిచిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సేవా భావనకు స్థానికులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, పండు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment