మల్లారెడ్డి చెరువు మినీ ట్యాంక్ బండ్ ద్వంసం ఆలనాపాలనా లేక అధోగతి సుందరీకరణకు నోచుకోని ట్యాంక్ బండ్: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 

*మల్లారెడ్డి చెరువు మినీ ట్యాంక్ బండ్ ద్వంసం ఆలనాపాలనా లేక అధోగతి సుందరీకరణకు నోచుకోని ట్యాంక్ బండ్: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

*-గ్రానైట్ రాళ్లు, విద్యుద్దీపాల దొంగతనం, చెట్ల నరికివేత*

  1. *-క్లీన్ అండ్ గ్రీన్ నిల్, చెత్తాచెదారం ఫుల్*

*-ఓపెన్ జిమ్ నాశనం, ఎక్కడ చూసినా ముళ్ల పొదలే*

*-గంజాయి, డ్రగ్స్, మద్యానికి అడ్డాగా మినీ ట్యాంక్ బండ్*

*-ఆర్మూర్ పట్టణంలోని మురికి నీరంతా మల్లారెడ్డి చెరువు ట్యాంక్ బండ్ లోకే*

*-దుర్గంధం భరించలేక నరకం చూస్తున్న అరుంధతి నగర్ వాసులు*

*-జీవన్ రెడ్డి జనతా గ్యారేజ్ లో పిర్యాదు*

*-స్పందించిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, క్రైం నెంబర్-8గా నమోదు*

*-’నమస్తే ఆర్మూరు’ కార్యక్రమంలో భాగంగా మినీ ట్యాంక్ బండ్ సందర్శన*

*-మునిసిపాలిటీ పనితీరుపై మండిపాటు*

*-కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు శాపమని జీవన్ రెడ్డి ధ్వజం*

ఆర్మూర్,డిసెంబర్18:-

(ప్రశ్న ఆయుధం) ఆర్ సి

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు మినీ ట్యాంక్ బండ్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ద్వంసం అయిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి ఆర్మూర్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన జనతా గ్యారేజ్ లో ఈ మినీ ట్యాంక్ బండ్ దుస్థితి పై అరుంధతి నగర్ వాసులు పిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మాజీ జీవన్ రెడ్డి మల్లారెడ్డి మినీ ట్యాంక్ బండ్ ద్వంసం, అక్కడి విలువైన వస్తువుల చోరీపై క్రైం నెంబర్-8గా నమోదు చేసి గురువారం ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి ’నమస్తే ఆర్మూరు’ కార్యక్రమంలో భాగంగా మినీ ట్యాంక్ బండ్ ను సందర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ సహకారంతో తాను పగలనక, రాత్రనక శ్రమించి చెరువు చుట్టూ అభివృద్ధి చేసిన ట్యాంక్ బండ్ నేటి దుస్థితిని చూసి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆలనాపాలనా లేక అధోగతి పాలైన ట్యాంక్ బండ్ సుందరీకరణ నేడు కనుమరు గైందన్నారు. మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధిలో భాగంగా అందంగా అలంకరించిన, గ్రానైట్ రాళ్లను పెకిలించి ఎత్తుకెళ్లారని, రోడ్డుకిరువైపులా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల దొంగతనం జరిగిందని, పదేళ్ళపాటు తమ ప్రభుత్వ హయాంలో పెంచిన చెట్లను నరికివేశారని జీవన్ రెడ్డి అన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ కనిపించడం లేదని, ట్యాంక్ బండ్ ప్రాంతమంతా చెత్తాచెదారంతో నిండిపోయి కంపు కొడుతోందని, పట్టణ పౌరులు వ్యాయామం చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను నాశనం చేశారని, ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన ముళ్ల పొదలే కనిపిస్తున్నాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మల్లారెడ్డి చెరువు మినీ ట్యాంక్ బండ్ ఏరియా గంజాయి, డ్రగ్స్, మద్యానికి అడ్డాగా మారిందని, మినీ ట్యాంక్ బండ్ వద్ద ఎక్కడ చూసినా తాగిపడేసిన మద్యం సీసాలే పడి ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ మినీ ట్యాంక్ బండ్ రెండేళ్లలో ఎలాంటి ఆలనాపాలనా లేక డంపింగ్ యార్డు గా మారి దుర్గంధం వెదజల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టూరిజం అభివృద్ధి కోసం తెప్పించిన పడవలను కూడా ఎత్తుకెళ్ళి అమ్ముకున్నారని ఆయన పేర్కొంటూ ఇంత మోసం జరుగుతున్నా ఆర్మూర్ మునిసిపల్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని మురికి నీరంతా మల్లారెడ్డి చెరువు ట్యాంక్ బండ్ లోకి వదులుతున్నారని, దీంతో ఈ ట్యాంక్ బండ్ లోని నీరంతా కలుషితంగా మారిందన్నారు. దుర్గంధం భరించలేక నరకం చూస్తున్న అరుంధతి నగర్ వాసులు జీవన్ రెడ్డి జనతా గ్యారేజ్ లో పిర్యాదు చేశారని, దీనిపై స్పందించి తాను ’నమస్తే ఆర్మూరు’ కార్యక్రమంలో భాగంగా మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునిసిపాలిటీ పనితీరుపై మండిపడ్డారు. సమస్య ఎక్కడుంటే తాను అక్కడుంటా నని, ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడుతానని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు శాపమని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మునిసిపల్ శాఖను నిర్వహిస్తున్న రాష్ట్రంలోని పురపాలక సంఘాలు ఇంత సర్వనాశనం కావడం సిగ్గు చేటు అని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని జీవన్ రెడ్డి అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment