*వినయ్ రెడ్డి హామీతో *ఆందోళన విరమించిన ఎన్టీఆర్ కాలనీవాసులు**
ఆర్మూర్ (ప్రశ్న ఆయుధం) ఆర్.సి
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఎన్టీఆర్ (19 వ వార్డ్) కాలనీవాసులు ఆర్టీసీ అధికారులు రోడ్డున సైతం వదలకుండా గోడా కట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకుడు విజయ్ అగర్వాల్ దగ్గరికి వెళ్లి సంప్రదించడంతోని కాలనీ సమస్య గురించి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ రెడ్డికి ఆయన తెలియజేయడం జరిగింది.. గురువారం ఉదయం కాలనీ సభ్యులు రోడ్డు కోసం టెంట్ వేసి ధర్నా నిర్వహించడం జరిగింది. విషయం తెలుసుకున్న వినయ్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి 15 రోజులలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు , మాక్లూర్ సొసైటీ చైర్మన్ అశోక్ , పండిత్ పవన్ ,విజయ అగర్వాల్, భూపేందర్,, తదితరులు పాల్గొన్నారు.