నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
కామారెడ్డి పట్టణంలో టాంపరింగ్ వాహనాలపై చర్యలు – ఫైన్ విధించి నెంబర్ ప్లేట్లు ఏర్పాటు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి,ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 19
కామారెడ్డి పట్టణంలో నెంబర్ ప్లేట్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టాంపరింగ్ చేసి రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో అనేక వాహనాలను గుర్తించి సంబంధిత వాహనదారులకు ఫైన్ విధించారు. అదేవిధంగా నిబంధనల ప్రకారం వెంటనే నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయించి వాహనాలను రోడ్లపైకి అనుమతించారు. రోడ్డు భద్రతకు విఘాతం కలిగించే విధంగా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ సూచించారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో పోలీస్ సిబ్బంది నరేష్,అంజత్, అశ్వక్ పాల్గొని తనిఖీలను పకడ్బందీగా నిర్వహించారు.