విశ్వవ్యాప్తమైన భగవంతుని తత్వం

*విశ్వవ్యాప్తమైన భగవంతుని తత్వం*

(ప్రశ్న ఆయుధం) డిసెంబర్ 19 ఆర్ సి

ఆర్మూర్ మండలంలోనీ అంకాపూర్ గ్రామం

విశ్వరూప దర్శన యోగాధ్యాయ పారాయణం*

వైదిక ధ్యాన యోగ ఆశ్రమం అంకాపూర్ లో గాయత్రి మృత్యుంజయ మహా యజ్ఞాలు, శ్రీమద్ భగవద్గీత పారాయణం కొనసాగుతోందని సత్కార్య ప్రచారకుడు కంకణాల రాజేశ్వర్ శుక్రవారం మీడియాతో తెలిపారు. యజ్ఞం అనంతరం 11వ రోజు 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగాన్ని పారాయణం చేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీధరానంద భారతి స్వామి, వేద పునీతానంద భారతి స్వామి ప్రవచిస్తూ భగవంతుని స్వస్వరూపాన్ని గూర్చి తెలుపుతూ… అక్షర స్వరూపుడైన పరబ్రహ్మ పరమాత్మ. అక్షరం గూర్చి తెలుపుతూ ఎన్నటికీ నాశనం కానిదే అక్షరం. అక్షర బ్రహ్మను తెల్సుకున్నవాడే పరబ్రహ్మను పొందగల్గుతాడు. పరబ్రహ్మను పొందడానికి జిజ్ఞాసువులైన సాధకులు అనేక విధాలుగా సాధన చేస్తారు. ఈ విశ్వానికంతటికి ఆ పరబ్రహ్మనే

ఆశ్రయము. సనాతనమైన వేద ధర్మానికి మూలం ఆ పరబ్రహ్మ పరమాత్మే. భగవంతుని యొక్క గుణగణాలను వర్ణిస్తూ… ఎప్పటికీ నశించడు. అందుకే అవ్యయం అని అన్నారు. సదా ఒకే విధంగా ఉంటాడు కాబట్టి ఆ భగవత్ తత్వాన్ని సనాతనము అన్నారు. వేద విహితమైన సనాతన ధర్మము అనాది కాలము నుండి కొనసాగుతూ వస్తుంది కాబట్టి దాన్ని శాశ్వత ధర్మము అంటారు. భగవంతుడు అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, సృష్టికర్త, సకల జగదుత్పాదకుడు, సర్వదారుడు, సర్వేశ్వరుడు, నిత్యుడు, బుద్ధుడు, శుద్ధుడు, ముక్తుడు, ఆదిమద్యాంతరహితుడు. వేల శిరస్సులు, వేల నేత్రాలు, అసంఖ్యాకమైన భుజాలు, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడు, అగ్నివలే తేజస్వరూపుడు. ఆకాశంవలే అంతుచిక్కని వాడు. గాలివలే బంధింపశక్యం కాని వాడు. సముద్రం కంటే లోతైనవాడు. అణువణువునా వ్యాపించి ఉన్నాడు. అంతటా ఉండి అందర్నీ గమనిస్తున్నాడు అని భావించి ఎవరైతే ధర్మమునందు నిష్ఠగలిగి ఆ ధర్మ కార్యాలలో నిమగ్నమై ఉంటాడు. ఎన్నటికీ కూడా పాపముల చేత అంట బడడు. పాపానికి గురికాడు. అతడే భగవంతుని యొక్క సాన్నిత్యాన్ని పొందుతాడు. విశ్వవ్యాప్తమైన భగవంతుని తత్వం అని అన్నారు. ఈ సత్సంగంలో అంకాపూర్ కు చెందిన దంపతులతో పాటు పత్తిగారి అరుణ ప్రభాకర్ (సంగారెడ్డి), కరీంనగర్ మున్నగు ప్రాంతాల యజ్ఞ దంపతులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment