అన్నారం సర్పంచ్ అర్హతపై వివాదం… ఉన్నతాధికారులకు వినతిపత్రాలు

అన్నారం సర్పంచ్ అర్హతపై వివాదం… ఉన్నతాధికారులకు వినతిపత్రాలు

ఎస్టీ రిజర్వేషన్ స్థానంలో బీసీ అభ్యర్థి గెలుపుపై అన్నారం తండా గ్రామస్తుల అభ్యంతరం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 20

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అన్నారం గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ సర్పంచ్ స్థానంలో బీసీ డి ముత్యాల కులానికి చెందిన ముత్యాల రవీందర్ పోటీ చేసి నాలుగు ఓట్ల మెజార్టీతో గెలవడంపై అన్నారం తండా గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీ వ్యక్తి ఎస్టీ సర్టిఫికెట్ ఎలా పొందాడని ప్రశ్నిస్తూ అర్హత రద్దు చేయాలని ఉన్నత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. 2015కు ముందు స్కూల్ రికార్డుల ప్రకారం బీసీగా గుర్తింపున్నప్పటికీ ఫేక్ సర్టిఫికెట్ ఆధారంగా ఎన్నికల్లో పాల్గొన్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాసిల్దార్ జానకి విచారణ చేపట్టి నివేదిక పంపుతామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment