*నందిపేట్ నూతన సర్పంచ్ ను సన్మానించిన జిల్లా LPG గ్యాస్ డీలర్లు*
*ఆర్మూర్ (ప్రశ్న ఆయుధం) ఆర్ సి.*
ఆర్మూర్ నందిపేట్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఇటీవల ఎన్నుకోబడిన సిలిండర్ ఎర్రం లింగం ను నిజామాబాద్ జిల్లా LPG డీలర్లు ఘనంగా సన్మానించారు నందిపేట్ మండలం ఇండెన్ గ్యాస్ డీలర్ గా వృత్తిని నిర్వహిస్తున్న సిలిండర్ లింగం భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా తమలో ఒక్కడైన లింగం ను ఈరోజు నిజామాబాద్ జిల్లా LPG డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు మరియు LPGడీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మపురి సురేందర్ (నిజామాబాద్ ఇండియన్ గ్యాస్ డీలర్) ల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ఎత్తున ఈ రోజు నందిపేట్ కు వచ్చి సిలిండర్ లింగం ను సన్మానించారు జిల్లా ప్రధాన కార్యదర్శి అంబల్ల శ్రీనివాస్ మోర్తాడ్ కోశాధికారి ముప్ప సందీప్ నరేందర్ సుమన్ అశ్విన్ డి శ్రీనివాస్ లింబాద్రి దామోదర్ సునీల్ అజయ్ శ్రీపతి తదితరులు పాల్గొన్నారు న్యాయాధివాది ఊరే బాలయ్య ఎస్ రుక్మాజి గార్లు కూడా సన్మానించిన వారిలో ఉన్నారు