*పంచయత్ రాజ్ రోడ్లు ,వంతెన పునర్నిర్మాణం- పనుల మంజూరు కోసం మంత్రి కి వినతి.*
ఆర్మూర్ (ప్రశ్న ఆయుధం) ఆర్ సి
ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ రెడ్డి
ఆర్మూర్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర పంచయత్ రాజ్ ,గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు వినతి పత్రం అందజేశారు.
ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పంచయత్ రాజ్ డిపార్ట్మెంట్ రోడ్లు గ్రామానికి మరో గ్రామానికి రహదారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృశ్య మరియు రోడ్లు బాగా లేనందున ప్రజలు ఇబ్బందులవుతు ప్రమాదాలు కావడం మరియు లో లెవల్ వంతెన వలన వర్షాకాలం రహదారులు చెడిపోవడం,మునిగి పోవడం వలన ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది.
రోడ్ల విస్తరణ విస్తరణలో భాగంగా ఆయా గ్రామాల వివరాలు ఎలా ఉన్నాయి
1).ఆలూర్ మండలం గుత్ప & కల్లేడి గ్రామాల మధ్య వంతెన నిర్మాణం కోసం 2 కోట్ల 50 లక్షల రూపాయలు నిధుల కోసం,మాక్లూర్ మండలం మెట్టు ,గొట్టిముక్కలను కలుపుతూ లాక్మపూర్ వరకు సుమారు 1.6 కిలోమీటర్ ల రోడ్డు కోసం 1కోట్ల 52 లక్షల రూపాయలు నిధుల కోసం,మాక్లూర్ మండల కేంద్రం,మాక్లూర్ SC కాలనీ నుండి ముల్లంగి వరకు సుమారు 1.5 కిలోమీటర్ల రోడ్డు కోసం 1కోట్ల 42 లక్షల 50 వేల రూపాయలు నిధులు కోసం,ఆర్మూర్ మండలం మంథాని గ్రామం నుండి సుమారు రామ్ పూర్ వరకు 4.95 కిలోమీటర్ల రోడ్డుకు 4 కోట్ల 70 లక్షల,25వేల రూపాయలు నిధుల కోసం,డొంకేశ్వర్ మండలం మారంపల్లి R&B రోడ్ నుండి డొంకేశ్వర్ PR రోడ్డువరకు బైపాస్ సుమారు 3.70 కిలోమీటర్ల రోడ్డును 3కోట్ల 51 లక్షల 50 వేల రూపాయలను నిధుల కోసం,నందిపేట్ మండలం ఖుద్వంపూర్ గ్రామంలో నందిపేట్ మెయిన్ రోడ్డు నుండి ఎల్లమ్మ మందిరం వరకు ఘాట్ రోడ్డు నిర్మాణం కొరకు సుమారు 1.5 కిలోమీటర్ల కోసం 1కోటి 42 లక్షల 50 రూపాయల నిధులు కోసం పైన పేర్కొన్న రహదారులను, వంతెనలు ఆమోదం తెలిపలని మంత్రి దనసరి సీతక్కకి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి వినతి పత్రం అందజేయడం జరిగింది.