కలెక్టరేట్లో బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ ప్రారంభం
తల్లులకు సౌకర్యంగా – జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి,ప్రశ్న ఆయుధం డిసెంబర్ 22
కలెక్టరేట్ ఐడీఓసీలో తల్లులు శిశువులకు పాలు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళ సాధికారత కేంద్రం ఈ క్యాబిన్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి క్యాబిన్‌ను ప్రారంభించారు. రద్దీ ప్రాంతాల్లో చంటి బిడ్డల తల్లులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రతి బస్టాప్‌లో ఇలాంటి బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, అదనపు డీఆర్డీడీఏ సూపర్వైజర్, సఖి కేంద్రం, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.