ఈనెల 28న జరిగే జిల్లా స్థాయి శిక్షణ తరగతులు విజయవంతం చేయండి:
_ జిల్లా ఎం సి పి ఐ యు పార్టీ
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్ 22
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎం సి పి ఐ యు పార్టీ జిల్లా కార్యలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జబ్బర్ మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులకు ఉమ్మడి జిల్లా నిజాంబాద్ నుంచి కామారెడ్డి జిల్లా కమిటీ రెండు కమిటీలు కలిపి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఈ శిక్షణ తరగతులు విజయవతానికి ఉమ్మడి జిల్లా నాయకత్వం హాజరై విజయవంతం చేయాలని ఆయన అన్నారు ఈ శిక్షణ తరగతులు ఈ కాలంలో విన్నవారికి చాలా దోహదపడతాయని అలాగే శిక్షణ తరగతులు ఎన్నో వాటిని అమలు చేస్తే భవిష్యత్తులో అనేక సమస్యల నుంచి బయటపడే మార్గాలు తెలుసుకోవచ్చని ఈ శిక్షణ పాల్గొన్న వారికి అర్థమయ్యే విధంగా బోధించడం జరుగుతుందని అందరూ సమయానికి హాజరై శిక్షణ తరగతులు విజయవంతం చేయాలని ఆయన కోరారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన కేంద్రం తెల్చినటువంటి నాలుగు కోట్ల లను రద్దుచేసి 44 కోట్లుగా యధా విధంగా కొనసాగించాలని తదితర డిమాండ్లతో ఈ శిక్షణ తరగతులు బోధించడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో జిల్లా నాయకులు సదానందం రాజు తదితరులు పాల్గొన్నారు.