ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే సైకిల్ ర్యాలీ

ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సండే సైకిల్ ర్యాలీ

యువత ఫిట్‌నెస్‌ను జీవనశైలిగా మార్చుకోవాలి : 

అదనపు కలెక్టర్ మధు మోహన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి,ప్రశ్న ఆయుధం డిసెంబర్ 23:

ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మునిసిపల్ కార్యాలయం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ అనుమతితో జరిగిన ఈ ర్యాలీని జిల్లా అదనపు కలెక్టర్ (ఎల్.బి) మధు మోహన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. యువతతో కలిసి సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా ప్రతి పౌరుడి రోజువారీ జీవితంలో ఫిట్‌నెస్‌ను భాగం చేయడమే లక్ష్యమని అన్నారు. యువత శారీరక శ్రమకు అలవాటు పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ అధికారులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, సుమారు 100 మంది విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment