విధుల్లో అలసత్వం సహించేది లేదు
ఎంఈవోలు, ఉపాధ్యాయులపై కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం, డిసెంబర్ 23
మంగళవారం:
ఎంఈవోలు, ఉపాధ్యాయులు విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుమతి లేకుండా గైర్హాజరైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు మెరుగుపడాలని ఆదేశించారు. 20 శాతానికి మించి లీవ్ ఆప్షన్ ఉండకూడదన్నారు. పదవ తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, జుక్కల్‌పై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. విద్యార్థుల భద్రత, ఆటోల్లో ప్రయాణంపై జాగ్రత్తలు పాటించాలని కోరారు. సమావేశంలో డీఈఓ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.