30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నూతన సర్పంచ్
ఆర్మూర్ (ప్రశ్న ఆయుధం) ఆర్.సి. డిసెంబర్ 25:
ఆర్మూర్ మండలంలోని గోవింద్ గ్రామంలో 30 సీసీ కెమెరాలు గురువారం రోజున ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్మూర్ ఎసిపి వెంకటేశ్వర రెడ్డి , ఆర్మూర్ టౌన్ సీఐ సత్యనారాయణ గౌడ్ కార్యక్రమంలో పాల్గొని సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ఎసిపి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ విడిసి చైర్మన్ కాశీరెడ్డి భోజన్న , సర్పంచ్ అప్పల గణేష్ ,ఉపసర్పంచ్ దార్ల సుశీల్ కుమార్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు