ప్రయాణికుల్లో అప్రమత్తత పెంచిన జిల్లా పోలీస్ కళాబృందం
కామారెడ్డి బస్టాండ్లో దొంగతనలపై అవగాహన కార్యక్రమం
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్ 26:
కామారెడ్డి బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్ కళాబృందం శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ M. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా దొంగతనాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, రోడ్డు ప్రమాదాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల విషయంలో టోల్ ఫ్రీ నంబర్ 1930, మహిళల భద్రతకు సంబంధించిన సమస్యల కోసం షీ టీమ్స్ నంబర్ 8712686094, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ వాడుతూ వాహనాలు నడపడం, గంజాయి తదితర మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత తప్పుదోవ పడుతున్న తీరుపై హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాలు, సోషల్ మీడియా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, యు. శేషారావు, పీసీలు ప్రభాకర్, సాయిలు పాటలు–మాటల రూపంలో ప్రయాణికులకు సులభంగా అర్థమయ్యేలా సందేశాలు అందించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ పీసీ భూమయ్య, బ్లూ కోట్స్ పీసీలు శంకర్, శేఖర్ పాల్గొన్నారు.