మున్సిపల్ డైలీ వేజ్ కార్మికులకు కనీస వేతలం 16,500 ఇవ్వాలి

మున్సిపల్ డైలీవెజ్ కార్మికుల కు కనీస వేతనం 16,500/- ఇవ్వాలి.

సిద్దిపేట మున్సిపాలిటీలో గ్రూపులు ఏర్పాటు చేయాలి.

మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్

జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్

సిద్దిపేట ఆగస్టు 28 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న డైలీ వేజ్ కార్మికులకి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులకు ఇస్తున్న మాదిరిగానే 16,500 రూపాయలు వేతనాన్ని ఇవ్వాలని, వారికి సొసైటీ గ్రూపులను ఏర్పాటు చేయాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్ డిమాండ్ చేశారు. గురువారం రోజున వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టరేట్ ఏవో రెహమాన్ కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాలిటీలో గత ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్న డైలీ వేజ్ కార్మికులకి జీవో నెంబర్ 60 ప్రకారం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు ఇస్తున్న మాదిరిగా 16,500 ఇవ్వకుండా మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో 12000 నిర్ణయించి వాటిని కూడా అమలు చేయకుండా కేవలం 10 నుంచి 8000 వరకే జీతాలు ఇస్తున్నారని శ్రమ చేసుకునేటప్పుడు ఎనిమిది గంటల నుండి 10 గంటల వరకు పనులు చేపిస్తున్న వారి శ్రమకు తగ్గ ఫలితాలు ఇవ్వడం లేదని కాబట్టి వెంటనే సొసైటీ గ్రూపులు ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల మాదిరిగానే వీరికి కూడా 16,500 జీతం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు లేనిపక్షంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు దబ్బేట రాజయ్య కార్మికులు నరసవ్వ, బాలమని,శేఖర్, బాలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now