బోనాల పండుగలో కుల వివక్ష పై జాతీయ ఎస్సీ కమిషన్,
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ లకు డిబిఎఫ్ పిర్యాదు
మర్కుక్ ఆగస్టు 28 ప్రశ్న ఆయుధం :
శివారు వెంకటాపూర్ గ్రామంలో జరిగిన బొనాల పండుగలో దళితుల పట్ల కుల వివక్ష,అంటరాని తనం పాటించిన సంఘటన పై జాతీయ ఎస్సీ కమిషన్,రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనల్ లో డిబిఎఫ్ పిర్యాదు చెసింది.ఈ సందర్భంగా దళిత బహుజ ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామంలో 2024 ఆగష్టు 21 నుండి 25 వరకు బొండ్రాయి,మైసమ్మ,ఎల్లమ్మ,దుర్గమ్మ గ్రామ దేవతలకు బోనాల ఉత్సవం జరిగిందన్నారు. ఈ గ్రామంలో ని పురాతనమైన దుర్గమాత అలయం స్ధానంలో దాతల సహకారంతో కొత్త గుడిని నిర్మించారని ఈ ఉత్సవం లో దళితులతో సహ గ్రామస్తులందరు పాల్గొనాలని నిర్ణయించుకున్నారని.బొండ్రాయి,దున్నపొతు వధ తదితర కార్యక్రమాలని కలిసే జరుపుకున్నప్పటికి దున్నపొతు వధ తర్వాత ఇక దళితులతో పని లేదని ముదిరాజ్ లు,గౌడ్ లు దుర్గమాత కు బొనాల సమర్పణకు దళితులు రావద్దని అడ్డుకున్నారని, దళితులు గుడి మెట్లు ఎక్కితే మైల పడుతదని అంటరానితనం, కుల వివక్ష పాటించి దళితులు బోనాలు సమర్పించకుండా అడ్డుకున్నారు.దళితులు తయారు చెసిన బొనాలను తప్పని పరిస్థితి నిస్సహయ పరిస్థితి లో దళిత వాడ పక్కనె వున్న కాలువలో బొనాలు వెసి గంగలో కలిపామని సంతృప్తి చెందారని ఆవెదన వ్యక్తం చేశారు.ఈ కుల వివక్ష పూ దళితులకు,బిసిల మధ్య జరిగిన చర్చలలో బిసిలు మొండికేయడంతో పక్కనె వున్న మర్కుక్ పొలీస్ స్టేషను మెట్లు ఎక్కారు.తమకు జరిగిన అన్యాయం పై పొలీస్ స్టేషను లో పిర్యాదు చేసిన ఎస్.ఐ దామొదర్ కేసు నమోదు చేయకుండా కౌన్సిలింగ్ పేరుతో కాలయాపన చేశాడన్నారు.గజ్వేల్ సి.ఐ మహేందర్ రెడ్డి దృష్టి కి వెళ్ళగా 26-8-24 నాడు గ్రామాన్ని సందర్శించి ఇరువర్గాలతో చర్చలు జరిపిన దళితులను గుడిలోకి రానివ్వమని బిసిలు మొండికి వేయడం తో కేసులు నమోదు చేయాల్సివస్తదని హెచ్చరించారని గుర్తు చేశారు. అయిదుగురి పై BNS,ఎస్సీ,ఎస్ఠి అత్యాచారాల నిరోధక చట్డం కింద కేసులు నమోదు చేశారని తెలిపారు..
ఇ సమాచారం అందుకున్న నవతెలంగాణ పత్రిక ప్రతినిధి జాలని యాదన్న కుల వివక్ష పై ప్రత్యెక కధనం రాయగా కుల వివక్ష బట్టబయలైనది.(గ్రామంలో సి.ఐ అధ్వర్యంలో జరిగన సమావేశ సమాచారాన్ని సైతం ఎస్.ఐ మిడియా వాట్సప్ గ్రూప్ లో తప్పుడు సమాచారం పెట్టారు.రాబోయే ఎన్నికలు గంజాయి మత్తు పదార్ధల పై అవగహన కల్పించామని) ఈ నేపధ్యంలో డిబిఎఫ్ నిజనిర్దారణ బృందం 27-8-2024 నాడు ఉదయం గ్రామాన్ని సందర్శించి కుల వివక్ష వివరాలను సేకరించి గ్రామంలో, పోలీస్ స్టేషను ముందు నిరసన వ్యక్తం చేసి కుల వివక్ష పాటించిన నిందితుల పై చర్యలు తీసుకొవాలని కొరారు. కాని ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదని. నిందితులను తక్షణమే అరెస్టు చెసి కఠిన చర్యలు తీసుకొని కుల వివక్షను రూపు మాపాలని కొరారు..గ్రామాన్ని జిల్లా కలెక్టర్, పొలీస్ కమిషనర్ సందర్శించాలని,గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలని కొరారు.అదె విధంగా సకాలంలో FIR నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన ఎస్.ఐ పై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సెక్షన్ 4 ప్రకారం చర్యలు తీసుకొవాలని కోరారు.తమ విన్నపానికి కమిషన్ లు సానుకూలంగా స్పందించాయని చర్యలు తీసుకుంటామని హమి ఇచ్చారు.
నేడు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ వెంకటాపూర్ కు రాక
బొనాల ఉత్సవం లో దళితుల పట్ల కుల వివక్ష ,అంటరానితనం పాటించిన శివారు వెంకటాపూర్ గ్రామాన్ని గురువారం నాడు రాష్ట్ర ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రానున్నారు.సంఘట పూర్వ పరాలు తెలుసుకొనున్నారు. వెంకటాపూర్ విచారణ అనంతరం ములుగు బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను తనీఖి చెస్తారు.కొండలక్మణ్ బాపుజి హార్టికల్చర్ యూనివర్సిటీ ని సైతం సందర్శిస్తారు.