ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు
41 రోజుల దీక్ష అనంతరం కామారెడ్డి అయ్యప్ప స్వామి గుడిలో ఘనంగా ఇరుముడి కార్యక్రమం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం జనవరి 01
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టేక్రియల్ గ్రామానికి చెందిన శివాలయ సన్నిధానం అయ్యప్ప స్వాములు 41 రోజుల కఠిన దీక్ష అనంతరం శబరిమల యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడిలో భక్తిశ్రద్ధలతో ఇరుముడి కట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఇరుముడి కార్యక్రమంలో పెద్ద పోతన్నగారి రాజేష్ గురు స్వామి, పెద్ద ఓబ్లేష్ గురు స్వామి, మల్లుపేట రమేష్ గురు స్వామి, బోదేపల్లి చిన్న ఓబ్లేష్ గురు స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములు “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో శబరిమల యాత్రకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కాసార్ల నరేష్ స్వామి, చెవిటి వేణు స్వామి, పెద్ద పోతన్నగారి రాహుల్, మెడుదుల అశోక్, రాము, రాజేందర్, సంతోష్, నరేందర్, రాకేష్, నరేష్‌తో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వాములకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తులందరూ యాత్ర సాఫీగా సాగాలని, అయ్యప్ప స్వామి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.