కెవిపిఎస్ పోరాట ఫలితమే శివారు వెంకటాపూర్ లో పౌర హక్కుల దినం
వెంకటాపూర్ గ్రామాన్ని సందర్శించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
గ్రామాన్ని సందర్శించిన ఆర్డిఓ ఏసీపీ అధికారులు
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామంలో గత వారం రోజుల నుండి జరుగుతున్న కుల వివక్షత రూపుమాపడం కోసం కెవిపిఎస్ అలుపెరుగని పోరాటం నిర్వహించింది పోరాట ఫలితంగానే గురువారం రోజు శివార్ వెంకటాపూర్లో పౌర హక్కుల దినాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బక్కెల్లి బాలకిషన్, ఉపాధ్యక్షులు మరాటి కృష్ణమూర్తి, ఆర్డిఓ బన్సీలాల్ తాసిల్దార్ హరిఫా, ఏసీపీ పురుషోత్తం రెడ్డి, సిఐ మహేందర్ రెడ్డి, ఎస్సై దామోదర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బక్కెల్లి బాల కిషన్, ఉపాధ్యక్షులు మరాటి కృష్ణమూర్తి
డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ లు మాట్లాడుతూ గత వారం రోజుల నుండి కుల వివక్షత పాటించిన వారిని వెంటనే రిమాండ్ చేసి అరెస్టు చేయాలని అన్నారు. జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో పౌర హక్కుల దినాన్ని ప్రతినెల 30 వ తేదీన జరపాలని కోరారు. 30 న హక్కుల దినం జరపడం వలన గ్రామాలలో ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కలిసిపోయే విధంగా అధికారులు చొరవ చేసుకోవాలి అని అన్నారు. ప్రతినెలా క్రమం తప్పకుండా పౌర హక్కుల దినం జరపడం వలన గ్రామాలలో నెలకొన్న కుల వివక్షత రూపుమాపే విధంగా అవగాహన ప్రజల్లో ఉంటుందని అన్నారు. సమావేశం అనంతరం ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య , ఆర్డిఓ బన్సీలాల్, ఏసిపి పురుషోత్తం రెడ్డి లతో కలిసి గ్రామస్తులు, దళితులు అందరితో ఆలయ ప్రవేశం చేపించి కొబ్బరికాయలు కొట్టి కుల వివక్షత పాటించ వద్దని అన్నారు. ఇకనుండి గ్రామస్తులందరూ కలిసిమెలిసి ఉండాలని కోరారు. మర్కుక్ మండల అధ్యక్షులు పోట్టొల్ల దాసు, ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ నాయకులు, ఎడమ వెంకటేశం, తుప్ప నాగరాజు, ఊషి గారి పరశురాం, ఎస్ దశరథ, కురాడపు కరుణాకర్, మర్కుక్ మాజీ సర్పంచ్ నర్సింలు, నాయకులు గ్రామస్తులు, శేఖర్, జీవన్, మల్లయ్య, యాదగిరి, లక్ష్మి, కమలమ్మ, భాగ్య తదితరులు పాల్గొన్నారు.