తెలంగాణ బడ్జెట్….

నేడు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్రబడ్జెట్

ప్రశ్న ఆయుధం జులై 25
హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పద్దును ప్రవేశపెట్టను న్నారు. నేడు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌ ఆమోదం పొందు తుంది.

ఆ తర్వాత డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెడతారు.

శాసనమండలిలో ఐటీ మంత్రి మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2.75 లక్షల కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ పద్దును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

అయితే ఈసారి రూ.2.80 లక్షల కోట్ల నుంచి రూ.2.90 లక్షల కోట్ల మధ్య పద్దు ఉండే అవకాశం ఉంది. రేవంత్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రంగాలకే బడ్జెట్‌లో అధికంగా నిధులు కేటాయించనున్నట్లు తెలిసింది.

ఎన్నికకల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు దాదాపుగా రూ.50 వేల కోట్లకు పైగా నిధులు దక్కే అవకాశా లున్నాయి. ముఖ్యంగా రుణమాఫీకి రూ.30 వేల కోట్లు, రైతు భరోసా పథకా నికి రూ.15 వేల కోట్లతో కలిపి ఒక్క వ్యవసాయ శాఖకే అత్యధికంగా రూ.50 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించే ఛాన్స్ ఉంది.

సంక్షేమ శాఖలన్నింటికీ కలిపి రూ.40 వేల కోట్లు, సాగు నీటి రంగానికి రూ.29 వేల కోట్లు, విద్యుత్‌ శాఖకు రూ.15 వేల కోట్లు, వైద్య శాఖకు రూ.15 వేల కోట్లు, ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం గృహనిర్మా ణశాఖకు రూ.8 వేల కోట్ల నిధులు కేటాయించే అవకాశా లున్నాయి.

కాగా, నేడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరుకానున్నట్లు సమా చారం. బడ్జెట్ ప్రసంగంలో ఆయన పాల్గొంటారని తెలిసింది.

ఇదే జరిగితే కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి రావడం ఇదే తొలిసారి కానుంది. గత ఓటాన్ అకౌండ్ బడ్జెట్ సమావే శాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఈసారి మాత్రం సభకు వచ్చి బడ్జెట్ చర్చలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Join WhatsApp

Join Now