కేబినెట్ భేటీ

నేడు సీఎం చంద్రబాబు కేబినెట్ అత్యవసర సమావేశం

ప్రశ్న ఆయుధం 25జులై
అమరావతి:
సీఎం చంద్రబాబు నాయు డు అధ్యక్షతన సచివాల యంలో ఇవాళ మంత్రివర్గం భేటీ కానుంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ భేటీ ప్రారంభమవు తుంది.

మంత్రివర్గ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవలే చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకు న్నారు.

తాజాగా స్వల్ప వ్యవధిలోనే మరోసారి మంత్రివర్గ భేటీ జరగనుండటంతో ఏఏ అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారనే అంశం ఆసక్తి కరంగా మారింది.

ముఖ్యం గా కేంద్ర బడ్జెట్ అనంతరం జరుగుతున్న మంత్రి వర్గ భేటీ కావడంతో.. పోలవరం, అమరావతి రాజధాని, ఇతర విషయా లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు న్నాయి.

లోక్ సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏపీకి పలు రంగాలకు కేటాయింపులు దక్కాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరానికి 15వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్న ట్లు బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సహకారం అంది స్తామని అన్నారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధు లు మంజూరు చేస్తామని, విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని చెప్పారు.

ఇవేకాక.. పలు రంగాలకు సంబంధించి ఏపీకి కేంద్ర బడ్జెట్ లో నిధులు మంజూరు కానున్నాయి..

Join WhatsApp

Join Now