విప్లవ తెలంగాణ గడ్డమీద కుల వివక్షతగదు

,విప్లవ,తెలంగాణ ఉద్యమ గడ్డ మీద కుల వివక్ష తగదు.

దళితులతో ఆలయ ప్రవేశం,సహంపక్తి బోజనం చేయించిన

రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

సిద్దిపేట ఆగస్టు 29 ప్రశ్న ఆయుధం :

విప్లవ,తెలంగాణ ఉద్యమం జరిగిన తెలంగాణ లో నేటికి కుల వివక్ష అంటరానితనం పాటించడం విచారకరమని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య విచారం వ్యక్తం చేశారు. దళితులను తోటి మనుషులుగా సమానం గా చూడాలని,కుల వివక్ష పాటిస్తె తగిన చర్యలు తప్పవని సున్నీతంగా హెచ్చరించారు. దుర్మ్మ పండుగలో దళితుల బొనాలను అడ్డుకొని అంటరానితనం పాటించిన మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ పూర్ గ్రామంలో గురువారం నాడు రాష్ట్ర ఎస్టీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య,కమిషన్ సభ్యులు జిల్లా శంకర్,కె.లక్ష్మీ నారయణ,రాము బాబు నాయక్ బ్రందం పర్యటించి. దళితవాడలొని ఎల్లమ్మ,మాతమ్మ గుడి వద్ద గజ్వేల్ ఆర్డిఓ బన్సిలాల్ అధ్యక్షతన జరిగిన పౌర హక్కుల దినోత్సవం లో పాల్గొని దళితుల అవేదనను విన్నారు.అదేవిధంగా దుర్గమ్మ అలయంలో దళితులతో ప్రవేశం చెయించి కొబ్బరికాయలు కొట్డి పూజాలు నిర్వహించారు.సహపంక్తి బోజనం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో జనశక్తి మవొయిస్టు పార్టీల నాయకత్వంలో జరిగిన విప్లవ ఉద్యమం వల్ల దళితులలో చైతన్యం పెరిగి ఆత్మగౌరవాన్ని పెంపొదించుకున్నారన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ప్రశ్నించెతత్వాన్ని అందించారన్నారు.అంబేద్కర్ స్ఫూర్తితో అధిపత్యాన్ని ప్రశ్నించి సమానంగా జివించాలని పిలుపునిచ్చారు.గ్రామంలో వ్యవసాయం తదితర పనులను కలిసి మెలసి చెసుకున్నట్లే కుల బేధాలను మరిచి మనుషులుగా కలిసి,మెలసి జివించాలన్నారు.కుల వివక్ష పాటిస్తె చర్యలు తప్పవని కఠినంగా వ్యవహరించాలని ఎసిపి నిఅదెశించారు.బతుకమ్మ తదితర పండుగలలో దళితుల పట్ల వివక్ష పాటిస్తే తన దృషికి తీసుక రావాలని తగిన చర్యలు తీసుకుంటామని హమి ఇచ్చారు.గ్రామంలో ప్రభుత్వ భూములను సర్వే చేసి భూమి లెని దళితులకు భూ పంపిణి చేయాలని ఆర్డిఓ ను ఆదెశించారు. ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి కుల వివక్ష నిర్మూళనకు చర్యలు చెపట్టి ప్రజలలో అవగహన కల్పించాలని రెవెన్యూ, పొలీసు అధికారులను అదెశించారు.
దుర్గమ్మ పండుగలో బొనాలు తీయకుండా అడ్డుకున్నారని,బతుకమ్మ సైతం కలసి అడనివ్వరని దళిత యవకులు జివా, నవిన్ తదితరులు చైర్మన్ కు విన్నవించారు.డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ దుర్గమ్మ పండుగలో దళితుల పట్ల వివక్ష పాటించిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. గ్రామంలో ని భూమిలేని పది కుటుంబాలకు భూ పంపిణీ చేయాలని,యాదమ్మ,లలిత తదితరులకు పెన్షన్ రావడం లేదని, 30 లక్షలతో భూమి పూజ చెసిన ఎస్సీ కమ్యూనిటీ హల్ నిర్మాణాన్ని ప్రారంభించాలని,దళిత వాడలొ విధి దీపాలు, డ్రైనేజి లెదని కనీస సదుపాయాల ను కల్పించాలని కొరారు.ఎస్సీ, ఎస్టీ కేసులలో నిర్లక్ష్యం వహించరదని విన్నవించారరు. ఎస్సీ,ఎస్టి బిసిలు ఒక జాతి బిడ్డలని కలిసి వుండాలని కొరారు.తమ వల్ల తప్పిదం జరిగినదని ఇక కలిసి మెలసి వుంటామని తమను క్షమించాలని బిసిలు వెడుకున్నారు.ఈ కార్యక్రమం లో ఎసిపి పురుషొత్తం,సిఐ మహేందర్ రెడ్డి,ఎస్.ఐ దామొదర్, తహసీల్దారు అరిఫా డిబిఎఫ్ నేతలు దాసరి ఎగొండ స్వామి,బ్యాగరి వేణు,కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరాఠి కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ ను దళితులు ఘనంగా సన్మానించారు.

Join WhatsApp

Join Now