చిలుకూరు బాలాజీ పవిత్రతను దెబ్బ తీస్తే తీవ్ర పరిణామాలు
రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన బజరంగ్ దళ్
భారీగా తరలివచ్చిన బజరంగ్ దళ్ కార్యకర్తలు
మెరుపు ధర్నా తో దిగి వచ్చిన సర్కారు
కూల్చేసిన అక్రమ కట్టడం
ప్రైవేట్ స్థలాన్ని వక్ఫ్ బోర్డ్ గా నిర్ధారించిన MRO ను సస్పెండ్ చేయాలని డిమాండ్
స్థానికులను భయ బ్రాంతులకు గురి చేసి, దగ్గరుండి బోరు వేయించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి..
ఓ ముస్లిం MLC కి తలొగ్గిన సర్కారు హిందువులకు క్షమాపణ చెప్పాలి..
సర్కారు నిర్లక్ష్యం వహిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా చిలుకూరు బాలాజీ భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిక
“అత్యంత పవిత్రమైన చిలుకూరు బాలాజీ పవిత్రతను దెబ్బతీసే కుట్రలను సహించం. చిలుకూరు బాలాజీ పరిసర ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న మసీదును తొలగించాల్సిందే” అని బజరంగ్ దళ్ హెచ్చరించింది. ముస్లిం పక్షపాత కాంగ్రెస్ ప్రభుత్వ దమన నీతిని ఎండగడతామని బజరంగ్ దల్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు హెచ్చరించారు. బుధవారం బజరంగ్దళ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి హిందూశక్తి ప్రదర్శించారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి అక్రమ కట్టడాలను తొలగించింది.