కాంగ్రెస్ పార్టీ సర్వమతాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గీరెడ్డి మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన ప్రకటనలో, వినాయక చవితి మండపాలకు ఉచిత విద్యుత్ అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం సంతోషకరమని, ముస్లింల ఈద్ ములాబ్ పండుగకు సంబంధించిన వేడుకలను 19న జరుపుకోవాలని ముస్లింల మత గురువులు ముఖ్యమంత్రితో చర్చించి అంగీకరించడం గొప్ప విషయమని అన్నారు.గీరెడ్డి మహేందర్ రెడ్డి, హిందూ ముస్లిం పండగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలను కోరారు. అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి, పండగలకు సంబంధించిన కీలక సూచనలు తీసుకుని, ప్రజల కోసం ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు…