శివ్వంపేట మండలంలో టి పి టి ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 9 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

శివ్వంపేట మండల కేంద్రంలో టి పి టి ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర కౌన్సిలర్ రాజేంద్రప్రసాద్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. శివ్వంపేట మండల బాధ్యతలను వరిగంటి సంతోష్ కుమార్ గుప్తా కు నారాయణ గౌడ్ కు మరియు ఎం సింహంకు మండల బాధ్యతలు అప్పగించారు. అనంతరం టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి మరియు రాష్ట్ర కౌన్సిలర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకువెంటనే పెండింగ్ డి ఏ లను విడుదల చేయాలని మరియు సిపిఎస్ రద్దు చేయాలని అదేవిధంగా 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని టి పి టి ఎఫ్ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now