శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి..!!

రాష్ట్రంలో శాంతిభద్రత లు క్షిణిస్తున్నాయి…

 మాజీ మంత్రి హరీష్ రావు

నిన్నటి దాడులు ఎందుకు ఆపలేదు..

కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తో0ది

 లా అండ్ ఆర్డర్ అదుపుతప్పడానికి కారణం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర/హైదరాబాద్/సెప్టెంబర్13 (ప్రశ్నయుధం వార్త ప్రతినిధి ఇన్యాలపు హరికృష్ణ):-

పదేళ్లపాటు శాంతి భద్రతల సమస్య రాకుండా బీఆర్ఎస్ పాలన సాగిందని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని నివాసంలో శుక్రవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని.. శాంతిభద్రతలు క్షీణిస్తుండటంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. లా అండ్ ఆర్డర్ అదుపుతప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమని విమర్శలు గుప్పించారు. శాంతి భద్రతలు అదుపు తప్పడానికి చేసిందంతా చేసి భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బందోబస్తు ఇచ్చి దాడులు చేయించింది ఎవరు ..? రేవంత్ రెడ్డి, డీజీపీలు కాదా ..? నిన్నటి దాడులు ఎందుకు ఆపలేదు. అది గాంధీ చేసిన దాడి కాదు రేవంత్ రెడ్డి చేసిన దాడి. మమ్మల్ని ఇవాళ హౌజ్ అరెస్ట్ చేశారు. నిన్న గాంధీని ఎందుకు హౌజ్ అరెస్టు చేయలేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా. ఖమ్మంలో మా మీద దాడి చేస్తే పది రోజులైనా గుండాల మీద కేసులు పెట్టలేదు. నిన్న జరిగిన దాడికి కర్త,కర్మ, క్రియ అంతా రేవంత్ రెడ్డే. ఆయన డైరెక్షన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది.

ఎమర్జెన్సీ కన్నా దారుణంగా రాష్ట్ర పరిస్థితులు తయారయ్యాయి.కోమటి రెడ్డి వెంకటరెడ్డి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాలని చెప్పడం దారుణం. ఫిరాయింపులపై ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎన్నిక లేకున్నా పీఏసీ చైర్మన్ ను నియమించి ఎన్నిక జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పడం దుర్మార్గం. డీజీపీ పదవి చాలా ఉన్నతమైంది. ఆదర్శంగా ఉండాల్సిన డీజీపీ.. రాజకీయ కుట్రలో భాగమై ప్రతిపక్షాల గొంతును నొక్కాలని చూడాలనుకుంటున్నారు. రాహుల్ గాంధీ దేశం బయట స్వేచ్ఛ స్వాతంత్య్రాల గురించి పాఠాలు చెప్పడం కాదు. తెలంగాణలో ఏం జరుగుతుందో చూడాలన్నారు. పీఏసీ చైర్మన్ పదవికి ఎన్నిక జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా ఇది జరిగింది. కరీంనగర్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో నీ పెత్తనం ఏంటని అరికెపూడి గాంధీ.. కౌశిక్ రెడ్డిని ప్రశ్నించారు. దానికి సమాధానంగానే కౌశిక్ రెడ్డి మాట్లాడారు తప్పా? సెటిలర్ల మీద కౌశిక్ కామెంట్ చేయలేదు. ముందు రెచ్చగొట్టింది గాంధీ. ఆయనకు చెప్పిన సమాధానం అది”అని హరీశ్ రావు తెలిపారు

Join WhatsApp

Join Now