కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నీ ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ కి పంపాలి
అతని మానసిక స్థితి బాగాలేదు
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి
కొమురవెల్లి సెప్టెంబర్ 20 ప్రశ్న ఆయుధం :
కొమురవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శుక్రవారం మాట్లాడారు కొమ్మూరి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని సొంత పార్టీ పార్టీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి తెలిపారు. ఇటీవల జన గామ కలెక్టర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సంఘటన జరిగిందని చెప్పారు, కొమరవెల్లి మల్లన్న ఆలయ ఉత్సవ కమిటీ కార్యక్రమం, చేర్యాల మార్కెట్ కమిటీ ప్రమాణం శ్రీకారం కార్యక్రమాలలో పాల్గొన్నారు అని అన్నారు. ఆయన మానసిక స్థితిని కార్యకర్తలు కుటుంబ సభ్యులు పట్టించుకోవాలి అని అన్నారు. ఓడిపోయిన తర్వాత కార్యకర్తలు ప్రజలు నాయకులు మీరు నాకు ఓట్లు వేయలేదని పోయిన వాళ్లపై ఆగ్రహం చేస్తున్నారని చెప్పారు ఓడిపోయిన కొమ్మూరి నాయకులు, ప్రజలను ఓట్లేయించలేదని అనడం సరికాదని అధికారిక అనధికారిక కార్యక్రమాలు ఏవో తెలుస్తలేవు చెప్పారు. గతంలో చేర్యాల జేఏసీలో ఉన్నాడని అతడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రెవెన్యూ డివిజన్, కోర్టు ఏర్పాటు విషయాలపై నిర్లక్ష్యం చేస్తూ రెవెన్యూ డివిజన్ కు అడ్డుపడుతుండని తెలిపారు. ఇలా చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది అయితదని వెంటనే దవాఖానాలో చూపియ్యాలి కొమ్మూరి ఈ ప్రాంతంలో అనేక భూములు కొనుగోలు చేశాడు అందులో ఫామ్ హౌస్ లు కట్టాడు. వాటిపై విచారణ చేయాలి అని అన్నాడు. ఫామ్ హౌస్‌లలో అనైతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అని వాటిపై వివరణ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఏ కోణం నుంచి చూసినా ఆయన పరిస్థితి బాగాలేదు. ఆయన మీద చర్యలు తీసుకోవాలే ఆయనను హాస్పిటల్లో చూపెట్టాలే మానసిక వైద్యుల తోటి ట్రీట్మెంట్ ఇప్పించాలే చేర్యాలలో ఏడెకరాల ఒక గుంట భూదాన భూమి ఆక్రమణ చేసిండు దానిమీద చర్యలు చేపట్టాలి, చేర్యాలలో కట్టిన ఇల్లు హైడ్రా కిందికి వస్తది దానిని బుల్డోజర్లు పెట్టి కుల కొట్టాలి. కాలువ భూమిలో డబ్బులు తీసుకొని ఇల్లు నిర్మాణం చేసిండు ఇవన్నీటిపై విచారణ చేపట్టాలని లేకుంటే సిపిఎం పార్టీ ఆందోళన చేపడుతుందని హెచ్చరిక జారీ చేసిండు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి జిల్లా కమిటీ సభ్యులు బద్దిపడగ కృష్ణారెడ్డి అత్తిని శారద దాసరి ప్రశాంత్ మండల నాయకులు తేలు ఇస్తారి, బోయిని మల్లేశం కర్రోళ్ల ఎల్లయ్య ఆరుట్ల రవీందర్ రాజేశ్వర్ నూకల శ్రీనివాస్ తాడూరి భరత్ తదితరులు పాల్గొన్నారు.