*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు
బహుజన్ సమాజ్ పార్టీ జూలూరుపాడు మండల కార్యదర్శి గార్లపాటి సైదులు మాట్లాడుతూ
అంధకారంలో పెద్ద హరిజనవాడకు వెళ్లే రహదారి ఉందని ఆ దారికి వీధిలైట్లు లేక పెద్దహరిజనవాడ గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు
పెద్ద హరిజనవాడ ప్రజల పరిస్థితి రెక్క ఆడితే కానీ డొక్కనిండని పరిస్థితి వారిది ఆ గ్రామ ప్రజలు ప్రతి రోజు కూలి పనుల నిమిత్తం పాపుకొల్లు కొత్తూరు రాజారావుపేట జూలూరుపాడు కొత్తగూడెం కు వెళ్లి పనులు ముగించుకొని రావాలి అంటే సాయంకాలం అవుతుంది ఒక్కొక్కసారి పనులు పూర్తయ్యేసరికి రాత్రి 9:00 కూడా అయినటువంటి పరిస్థితి ఉన్నది అలాంటి సమయంలో పెద్ద హరిజనవాడ గ్రామానికి వెళ్లాలి అంటే ఆటోలు కానీ ట్రాలీలు కానీ ఉండనటువంటి పరిస్థితి ఆ సమయంలో నడవాల్సిన పరిస్థితి ఆ గ్రామ ప్రజలుది చీకటి పడిందంటే చాలు ఆ రహదారి నిర్మానుషగా ఉంటుంది
ఆ సమయంలో వీధి దీపాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి
కొంతమందికి రాత్రి సమయంలో ఆటో డ్రైవర్ను బ్రతిమిలాడి అత్యధిక ధర ఇచ్చి ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు విషపూరితమైన పాములు తేళ్లు పురుగులు కంట పడ్డాయని ఆటో డ్రైవర్లు ప్రయాణికులు చెప్తున్నారు అలాంటి ప్రమాదకరమైన రహదారికి వీధి దీపాలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని ఆయన అన్నారు
ఈ పరిస్థితి అంతా గమనించి అతి త్వరగా పెద్ద హరిజనవాడకు వెళ్లే రహదారికి వీధి దీపాలు గాని సోలార్ లైట్లు గాని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారుల్ని కోరుతున్నానని ఆయన అన్నారు