స్వచ్ఛత హి సేవలో భాగంగా ప్రతిజ్ఞ రన్ నిర్వహణ
ప్రశ్న ఆయుధం, సెప్టెంబర్ 21, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో పురపాలక చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ బి. శ్రీహరి రాజు ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ 2024 ఐదవ రోజు కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత ప్రతిజ్ఞ, స్వచ్ఛతా రన్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ గంగాధర్ మాట్లాడుతూ.. బాన్సువాడను స్వచ్ఛ్ బాన్సువాడ గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్కూల్ పిల్లలు, నాయకులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం నుండి తాడ్కోల్ చౌరస్తా వరకు పిల్లలతో కలిసి స్వచ్ఛత రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దుద్దల అంజి రెడ్డి, సీనియర్ నాయకులు ఎజాజ్, కౌన్సిలర్లు నర్సాగొండ, కిరణ్ కనుకుట్ల రాజు, విద్యార్థులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.