తల్లి జగత్ జనని…. పదము వెంట అర్థము… అర్థము ఉన్నచో పదము ఎలా ఉండునో… ఏ విశ్వ పాలుకులైన మీరు ఇరువురు శివశక్తి ఒక చోటుని కలిసి ఉండుదురు కదా… నాలో నిశ్చలమై ఉన్న ఆత్మ ఆ పరమేశ్వరుడు అయితే… ఆ పరమేశ్వరుని ఎందుకని కనుగొనడానికి ఇచ్చా జ్ఞాన క్రియా శక్తివై నాలో కదలడుతున్న శక్తి స్వరూపిణి నీవే కదా…
మనము గమనిస్తూ ఉంటే ఈ ప్రకృతిలో సూర్యోదయంలో సూర్యుడు (అరుణ శక్తి, లలిత )… నిషీధిలో చంద్రుడు (తెలుపు.. శివ) సూర్యోదయ చంద్రోదయములు కూడా శివశక్తులే కదా…
ఉదయము వెలుతురు (తెలుపు.. శివ..) రాత్రి చీకటి (నలుపు -కామక్షి ) కూడా శివశక్తులే కదా…
అణువణువూ శివ శక్తుల మయమే కదా…
లింగ ఆకారంలో అధోభాగాలు శివ శక్తుల కలయికే కదా…
ఈ ప్రపంచం అంతా నిండిపోయిన ఆకార నిరాకార రూపము మీరే కదా… మము పాలించు దీన రక్షకులు… ఇంతటి కరుణామూర్తి అయినా మీకు నమస్కరించుట గత జన్మ పుణ్యఫలమే కదా బాల అంబ…🙏🙏
రచయిత్రి
ఉత్తర
రమ్య శ్రీ
కే పి హెచ్ బి
హైదరాబాద్