వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే కేసీఆర్‌ పాలన సాగింది -కేటీఆర్‌..

వీరనారి చాకలి ఐలమ్మ

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే కేసీఆర్‌ పాలన సాగింది – కేటీఆర్‌..!!

IMG 20240926 WA0034వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే కేసీఆర్‌ పాలన సాగిందన్నారు కేటీఆర్‌. ఇవాళ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి. ఈ తరుణంలోనే కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తికి ప్రతీక. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగువ మనందరికి ఆదర్శమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నిత్య స్మరణీయురాలు ఐలమ్మ . బహుజనులు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామ్యం కావటానికి ఆమెనే స్ఫూర్తన్నారు.ఉద్యమ పోరాటాల్లో మహిళల పాత్ర అసమానమైనది చాటి చెప్పి యోధురాలు ఐలమ్మ. ఇవ్వాళ ఆమె జయంతి సందర్భంగా ఆ మహనీయురాలిని స్మరించుకోవటం గొప్ప అవకాశం ఉందని తెలిపారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి, ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పాలన సాగింది.బడుగులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తూ ఐలమ్మను ఘనంగా స్మరించుకున్నామని వెల్లడించారు కేటీఆర్‌. చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డాక.. కేసీఆర్ గారు ప్రత్యేక చొరవతో ఐలమ్మ గారి జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చారని గుర్తు చేశారు.

Join WhatsApp

Join Now