దసరా పండగ సంబరాలకోసం తగు ఏర్పాట్లు చేయాలి
-మున్సిపల్ కమిషనర్ ని కోరిన ఐదవ వార్డు యువకులు
ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 26, కామారెడ్డి :
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోగల ఐదవ వార్డు గండిమాసానిపేట్ లో బతుకమ్మ , దసరా పండగలు వస్తున్న సందర్భంగా చెరువు దగ్గర కి వెల్లె దారి పూర్తిగా బురదమయంగా మారి, నీటి గుంతలు ఉన్నాయని చెరువుకు మెట్లు కూడా లేవని, చెరువుకు వెళ్ళే దారిని సీసీ రోడ్డుతో, చెరువు దగ్గర వరకు వెళ్ళే దారిలో లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. వార్డు పరిధిలో స్కూల్ వద్ద ఉన్న పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ మెట్ల దగ్గర గడ్డి, పిచ్చి మొక్కలను తొలగిచాలని మున్సిపల్ కమిషనర్ శ్రీ హరి రాజ్ కు వినతిపత్రం అందజేశారు. కమిషనర్ స్పందించి త్వరలోనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు యువకులు కుచులకంటి శంకర్, అట్కారి బబ్లూ ఉన్నారు.