అధైర్యపడొద్దు.. ఇళ్లు ఇస్తాం.
-రంగారెడ్డి కలెక్టర్ శశాంక.
హైదరాబాద్: మూసీ రివర్బెడ్ ప్రాంతంలో ఇండ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న వారికి అవగాహన కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఆర్డీవో వెంకట్రెడ్డి, తహసీల్దార్ రాములుతో కలిసి మాట్లాడారు.