మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ ఎంపీ నామ పరామర్శ.
తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని కొండాపూర్ లోని వారి నివాసం లో పురుషోత్తమ్ రెడ్డి చిత్ర పటం వద్ద ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావు నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించారు. మంత్రిని పరామర్శించిన వారిలో కార్తిక్ చిదంబరం, సురేష్ షట్కర్, శ్రావణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.