బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి
రైతులందరికీ రుణ మాఫీ చేయనందుకే బీ అర్ ఎస్ అక్కడ కూర్చొంది.
అదే బాటలో కాంగ్రెస్ నడవటం బాధాకరం.
రుణ మాఫీ కి 30 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరం అని చెప్పారు.
కానీ అంత బడ్జెట్ పెట్టలేదు.
సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 70 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నారు.
కానీ ఇందులో కోత విధించినట్లు తెలుస్తోంది.
ఏ ప్రాతిపాదికన రైతులను ఎంపిక చేసారు ?
వరంగల్ సభలో ఎటువంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని ఒప్పుకున్నారు.
మెలికలు లేకుండా రుణమాఫీ చేయాలి.
ఈ ఏడాది రైతు బంధు పడలేదు.
సీజన్ రైతు బంధు విడుదల చేయాలి.
రైతు బందుకు , రైతు భరోసా కు వేర్వేరు నిధులు కేటాయించాలి.
రైతు భరోసా పై అసెంబ్లీ లో చర్చ పెడతామని సీఎం చెప్పారు.
చర్చ ఎప్పుడు పెడతారో చెప్పాలి.
కౌలు రైతుల గోస పట్టించుకునే నాథుడే లేడు.
తెలంగాణలో దాదాపు 15 లక్షల కౌలు రైతు లు ఉన్నారు.
వారు మీరిచ్చిన హామీతో మీకు ఓటేశారు.
కౌలు రైతు లకు ఇస్తామన్న పెట్టుబడి సహాయం ఇచ్చి ఆదుకోవాలి.
పంట బోనస్ 500 ఇవ్వాలి.
ఎన్నికల హామీలు భారేడు నిధులు మాత్రం జానెడు అనే విధంగా ఉంది.
బడ్జెట్ అంకెల గారడీ గా ఉంది.
వ్యవసాయానికి 49 వేల కోట్లు అవసరం.
కానీ బడ్జెట్లో 31 వేల కోట్ల ఇచ్చారు.
కేసిఆర్ మాదిరిగానే సన్న బియ్యం కు బోనస్ ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమే.
ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటిలోగా ఇస్తారు ?
రాష్ట్రంలో 7 నెలల్లో 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
గత బీ అర్ ఎస్ ప్రభుత్వం రైతులను విస్మరించింది
అందుకే అక్కడ కూర్చున్నారు
భూమాత పోర్టల్ వచ్చేది ఎప్పుడు?
భూ సర్వే తో నష్టపోయిన ఎంత మందికి మీరు న్యాయం చేశారు?
రెవెన్యూ ట్రిబ్యునల్ కసరత్తు మొదలైందా?
పేదల భూములు కేసిఆర్ లాక్కున్నారని.
ఆ భూములు వెనక్కి తీసుకొని న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిన మాటేమిటి ?
గులాబి పార్టీ ఎంఎల్ఏ లు లక్షల ఎకరాలు దోచుకున్నారని ఆరోపణలు చేశారు ? ఆ లెక్క ఏమైనా తెలిసిందా?
రాష్ట్రం ఏర్పడినప్పుడు 24 లక్షల ఎకరాల అసైన్ భూమి ఉండే
ఇప్పుడు 5 లక్షల మాత్రమే ఉంది
అవి ఎవరు లాక్కున్నారు ? దాన్ని లెక్క ఏమైనా తెలిసిందా?
దానిపై ఎంక్వైరీ ఏమైనా వేశారా?
దీనిపై సీబీఐ ఎంక్వైరీ కి సిద్ధమా?
కాళేశ్వరం స్కాం ను సీబీఐ ఎంక్వైరీ కి ఇచ్చేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు ?
ధరణి పోర్టల్ విదేశీ కంపెనీ అధీనంలో ఉంది
విదేశీ కంపెనీకి అప్పజెప్పెందుకు బాధ్యులు ఎవరు?
దీనిపై ఇప్పటి వరకు విచారణ చేయలేదు
దీని వెనకున్న మతలబు ఏమిటి?
లక్షల ఎకరాల భూమిని బీ అర్ ఎస్ బాకాసురులు తింటే ఎందుకు ఎంక్వైరీ లేదు?
ధరణి సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారు ?
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేరవేర్చకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి
మంత్రి పొన్నం ప్రభాకర్ కు కౌంటర్ ఇస్తూ
రెండు రోజుల క్రితం కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చింది అనేది వివరించాం
కేంద్రం ఇచ్చిన నిధుల మీద చర్చ కు నేను సిద్ధం
ధరణి లో జరిగిన అవినీతి పై విచారణ అడిగితే సబ్జెక్ట్ డివియేట్ చేస్తున్నారు
దీన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్య ఉన్న అవగాహన ఒప్పందం అర్థం అవుతుంది
మీతో కాకుంటే సీబీఐ కి సిఫార్సు లేఖ రాయండి
24 గంటల్లో సీబీఐ ఆమోదం తీసుకొచ్చే బాధ్యత మాది