నిరుద్యోగ ఉపాధి కల్పన ధ్యేయంగా, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి

*నిరుద్యోగుల ఉపాధి కల్పనే ధ్యేయంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి– అల్ఫోర్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి*

*కరీంనగర్ ప్రశ్న ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు*

*జమ్మికుంట పట్టభద్రుల సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి*

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో అక్టోబర్ 6*

త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు ఆదివారం జమ్మికుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి హాజరైన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన కల్పించి రానున్న కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు పలుకాలని కోరారు తన ఎమ్మెల్సీ పరిధిలోని 4 ఉమ్మడి జిల్లా కేంద్రంలో యువతకు తన సొంత ఖర్చుతో ఒక్కొక్క వృత్తి నైపుణ్య కేంద్రం తో పాటు పోటీ పరీక్షలకు సిద్దమవుతూన్న వారికి ఉచిత శిక్షణతో పాటు వారికి పార్ట్ టైం జాబ్ కలిపించే విధంగా కృషి చేస్తానని జిల్లా కేంద్రంలో లైబ్రరీకి కృషి చేస్తానని చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి బాసటగా నిలిచి వారి పక్షాన పోరాడుతానని చెప్పారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల( కేజీబీవీ) లోని ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ (ఎంటిఎస్) అమలుచేసి వేతనాలు ఇవ్వాలని ఉపాధ్యాయుల డిమాండ్ ఉందని, వారి సమస్యలను ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ అయిన పిఆర్సి అమలు డిఏ పెంపు ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి పలు సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నరేందర్ రెడ్డి తెలిపారు ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వారికి హెల్త్ కార్డ్స్ ఇప్పించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జమ్మికుంటకు చెందిన పలు విద్యాసంస్థల అధినేతలు సంపత్ రావు శ్రీనివాస్ నర్సింగరావు తిరుపతి రెడ్డి రాజిరెడ్డి ఉపాధ్యాయులు విజయ్ నరేష్ ప్రభాకర్ పట్టభద్రులు రత్నాకర్ అనిల్ అశోక్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now