దసరా రోజున రావణ దహనం ఎందుకు చేస్తారు..
దసరా పండుగనాడు దేశమంతటా రావణ దహన వేడుకలు ఘనంగా జరుగుతాయి. అందరు కుటుంబ సమేతంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారుఈ కార్యక్రమానికి. అసలు రావణ దహన వేడుకలు ఎందుకు జరుగుతాయి అనే విషయం ఎవ్వరికి దాదాపుగా తెలియదు,అందులో ప్రస్తుత యువతకి అయితే దాదాపు ఎవ్వరికి ఈ విషయం పై అవగాహణ అయితే అస్సలు లేదు.
ప్రతి దసర పండుగకి వివిధ ఊర్లల్లో, నగరాల్లో పలు చోట్ల అందరు రావణ దహనం జరిగాక జమ్మి పెట్టి ఒకరికి ఒకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అసలు ఈ రావణ దహనం ఎందుకు చేస్తారో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం.
అసలు దసరా రోజున రావణ దహనం ఎందుకు చేస్తారు….?
దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టడానికి మన చరిత్ర మరియు పురాణాల ప్రకారం, శ్రీరాముని పాలనా కాలంనుండే ఈ విజయదశమిని విజయ ప్రస్థానంగా ఆచరణ లోకి తీసుకున్నారు . శ్రీరాముడు ఈ రోజే రావణుడి పై దండెత్తి యుద్దనికి వెళ్లాడట,వెళ్లి రావణాసురుడు పై విజయం సాధించాడట. చెడు పై మంచి గెలుపు సూచికగా ఈ విజయదశమి రోజున ప్రజలంతా కలిసి రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టే సంప్రదాయం ఏర్పడింది. మహార్నవమి నాడు శ్రీరామ చంద్రుడు దుర్గాదేవిని స్మరించి రావణ సంహారం చేయగా దేవతలంత ఆనందభరితులై దేవీ పూజ చేశారు. నాటి నుండిఇప్పటి వరకు అశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దుర్గ దేవీ నవరాత్రులను ఎంతో ఘనంగా నిర్వహించి పదవ రోజున విజయదశమి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
రాముడు రావణుని మీదకు యుద్దానికి వెడలిన దినం విజయదశమి అని వేద పండితులు చెబుతుంటారు.విజయదశమి రోజున రావణ దహనం వెనుక మరో పరమార్థం ఏమిటంటే, రోజు రోజుకీ ఆడవారి పై అత్యాచారాలు పెరగిపోతున్న ఈ రోజుల్లో పర స్త్రీని తల్లిలా,సోదరిల, పూజించాలని, లేకపోతే రావణుడిలాగా ఏదో ఒక రోజు వారి పాపం పండి దహించుకుపోతారని అందుకే మనిషిలోని కామ, క్రోధ, మద, మాత్సర్యాలను నశింప చేసుకోవాలని ఈ యొక్క రావణ దహనం సందేశం ఇస్తుంది, అందుకు దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టడతారు.చెడు పై కొంత ఆలస్యమైన మంచి ఎప్పుడైన జయీస్తుంది అనే సూచకంగా దసరా రోజున రావణాసురుని దిష్టి బొమ్మను తగులబెట్టడతారు.