నూతన హోమియో బ్రాంచ్ ప్రారంభం
ప్రశ్నాయుధం న్యూస్, అక్టోబర్ 16, కామారెడ్డి :
కామారెడ్డి పట్టణ ప్రముఖ సీనియర్ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పల్స హరీష్ గౌడ్ తమ రెండవ నూతన హోమియో వైద్య బ్రాంచ్ ను కామారెడ్డి పట్టణం పాత బస్టాండ్ లోని మ్యాక్స్ కేర్ కంటి ఆసుపత్రిలో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి 15 రోజులు ఉచితంగా హోమియో చెకప్ తో పాటు హోమియో మందులు కూడా అందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఇతర వైద్య విధానాల్లో పరిష్కారం కాని అన్ని రకాల వ్యాధుల చికిత్సకై సంప్రదించగలరని తెలిపారు. థైరాయిడ్, డయాబెటిస్, సోరియాసిస్, ఇన్ ఫర్టిలిటీ, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, ఫైల్స్, ఫిస్టులా, స్త్రీల గైనిక్ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్ మొదలగు వ్యాధులకు సమాజంలోని వివిధ వయస్సులవారు వివిధ రోగాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతి ద్వారా చికిత్స పొందవచ్చునని తెలిపారు. ఈ హోమియో మందులతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ప్రతి ఒక్క వ్యాధికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దివ్యభారతి, ఆప్తమాలజిస్ట్ లింబాద్రి, అసిస్టెంట్ శిరీష తదితరులు పాల్గొన్నారు.