ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురు మృతి

● ఒకరికి గాయాల

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 16 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరిక పల్లి చెక్కర ఫ్యాక్టరీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ మినహా కారు లోని ప్రయాణికులంతా ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ నంసింగ్ (42) ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు శివ్వంపేట మండలంలోని భీమ్లా తండా కు చెందిన శాంతి (38) అమ్ము (12) సీతారాం తండా కు చెందిన అనిత (35) హిందూ (15)శ్రావణి( 12) తాళ్లపల్లి తండా చెందిన శివారం (56) దుర్గి (45) మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి శివ్వంపేట ఎస్సై మైపాల్ రెడ్డి, సిఐ రామకృష్ణ, శివ్వంపేట మండల పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన వారిని పోస్టుమార్టం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Join WhatsApp

Join Now