చేయ్యెత్తిన చోట ఆ పని బస్సులు!!

బిచ్కుంద కు సమయానికి బస్సు లేక ప్రయాణికుల అవస్థలు

పట్టించుకోని ఆర్టీసీ అధికారులు

చేయ్యెత్తినచోట ఆపని బస్సులు

ప్రశ్న ఆయుధం 01 ఆగస్టు (బాన్సువాడ ప్రతినిధి)

ప్రభుత్వం ఒకవైపు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీని అభివృద్ధి బాటలో పయనించేలా చేయాలని చూస్తుండగా ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో సమయానికి బస్సులు రాక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.గురువారం బాన్సువాడ సంత కావడంతో బాన్సువాడ నుంచి బిచ్కుంద కు వెళ్లే మార్గంలో సమయానికి బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.ప్రతిరోజు ఇదే తంతు కొనసాగుతుందని దీంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒకవైపు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అంటూ ప్రచారాలు చేస్తున్న సమయానికి ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రోజు బస్టాండ్ మొత్తం ఎటు చూసినా ప్రయాణికులే కనిపించారని ప్రయాణికులకు విషయం అడగగా బిచ్కుంద వైపు బస్సులు లేవని గంటల తరబడి వేచి చూస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి,సమయానికి బస్సులు వచ్చేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

*ఆర్టీసీ డిపో మేనేజర్ వివరణ*

  • ఈ విషయమై బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ ను వివరణ కోరగా, దెగ్లూరు వైపు ఓకే బస్సు ఉందని బిచ్కుందకు చాలా బస్సులు నడుస్తాయని తెలిపారు.

Join WhatsApp

Join Now