పారుశుద్ధ్య కార్మికులను బదిలీ చేయవద్దని కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన- మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

పారుశుద్ధ్య కార్మికులను బదిలీ చేయవద్దని కలెక్టర్కు విజ్ఞప్తి చేసిన- మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 20

కరోనా కష్టకాలంలో ఇల్లందులో వారు ఫ్రంట్ వారియర్స్ గా పనిచేశారు.
పారిశుద్ధ్య కార్మికులను రాష్ట్రంలో ఎక్కడ బదిలీ చేయలేదు*
ఇల్లందు తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్* వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టు యు ఆధ్వర్యంలో
శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ ను కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యయూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి కలెక్టర్ గారికి వివరిస్తూ ఇల్లందుమున్సిపాలిటీ పారిశుద్ధ్య విభాగంలో పని చేస్తున్న పీహెచ్ వర్కర్స్ లని కొత్తగూడెం ట్రాన్స్ఫర్ చేశారు. వారి బదిలీని రద్దుచేసి ఇల్లందులోనే వారి సేవలను కొనసాగించాలన్నారు. కరోనా విపత్తులో ఆకార్మికుల సేవలను చూసి ప్రభుత్వం ఫ్రంట్ వారియర్స్ గా గుర్తించి పారితోషికం ఇచ్చారుఅనిగుర్తుచేశారు.
దేశంలో రాష్ట్రంలో ఇల్లందు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగాకృషి చేసేందుకు వారిసేవలను అభినందించాల్సింది పోయి
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులను బదిలీ చేయలేదన్నారు. కేవలం ఇల్లందు లోనే బదిలీ చేయడం బాధాకరమని అన్నారు.
కార్మికులు అనారోగ్యంతో ఉన్నారని వారి తల్లి,తండ్రి అత్తమామలను కూడా ఈ వయసులో చూసుకోవాలని ఇట్లాంటి సమయంలో వేరే ప్రాంతానికి బదిలీచేయడం వల్ల వారి కుటుంబాలు ఇబ్బందుల్లో పడతాయన్నారు. కలెక్టర్ గారు పరిశీలన చేస్తామని అన్నారు ఈ వినతి పత్రం కార్యక్రమంలో మున్సిపాలిటీ జవాన్ అంజద్ పిహెచ్ వర్కర్లు
లక్ష్మణ్, విక్రమ్, రాణి, రమణ, దుర్గా యశోద,బాలరాజు,సిద్దంకి ఎంకన్న పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now