అపరిచితుల నుండి ఫోన్ కాల్ వస్తే వెంటనే 1930 కు సమాచారం అందజేయగలరు..
కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 20:
కామారెడ్డి పట్టణం సంబంధించిన రవికుమార్ అనే వ్యక్తికి ఒక గుర్తు తెలియని వ్యక్తి తెలియని నెంబర్ నుండి ఫోన్ చేసి, మీ కూతురు డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయింది, ఆమెను అరెస్ట్ చేసి ముంబై తీసుకెళ్తున్నాము, నువ్వు వెంటనే డబ్బులు ఇవ్వకపోతే నీ కూతురు నీకు ఇంకా దక్కదు అని బెదిరించగా, వెంటనే ఇట్టి వ్యక్తి కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చి జరిగిన విషయాన్ని నాకు చెప్పగా, నేను ఆ ఫోన్ చేసిన వ్యక్తితో మాట్లాడి, ఆ వ్యక్తి ఫేక్ పర్సన్ అని గ్రహించి, అతని నెంబర్ను బ్లాక్ లో పెట్టి, ఆ తర్వాత అమ్మాయి కి ఫోన్ చేయగా, ఆమె తాను చదువుతున్న ప్రదేశంలోనే ఉన్నట్టుగా, ఎవరు కూడా ఆమెను తీసుకు వెళ్లడం లేదని తెలిపింది.
కావున పట్టణ ప్రజలందరికీ ముఖ్య విన్నపం ఏమనగా, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మేము పోలీస్ వాళ్ళము అని చెప్పి డబ్బులు ఇవ్వమని బెదిరించినట్లయితే, వెంటనే 1930 నంబర్ కి గాని లేక 100 నెంబర్ కి గాని డయల్ చేసి సమాచారాన్ని ఇవ్వగలరని పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
అపరిచితుల నుండి ఫోన్ కాల్ వస్తే వెంటనే 1930కు సమాచారమే అందజేయగలరు..
by kana bai
Published On: October 20, 2024 10:59 pm