బాటసారి పయనం ముగిస్తున్నది..

తరం వెళ్ళి పోతున్నది..

-ఆ ప్రేమ కనుమరుగైపోతున్నది

-తరం వెళ్ళిపోతుంది

-ప్రేమగల పెద్దరికం కనుమరుగైపోతుంది.బహుదూరపు బాటసారై పయనం ముగిస్తున్నది.

-జ్ఞాపకాల మూట వదిలి బాటపట్టి పోతుంది

-తెల్లని వస్త్రధారణతో
-స్వచ్ఛమైన మనసుతో
-మధురమైన ప్రేమతో

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 21:

అందరి పట్ల అనురాగంతో
విలువలతో కూడిన బ్రతుకును సాగించిన మన ముందు తరం తిన్నగా చేజారి పోతున్నది.
వయోభారంతో మనల్ని వదిలిపోతుంది.
హుందాతనపు మీసకట్టు.
రాజహాసపు పంచ కట్టు.
పూటకో తీరు మార్చని మాట కట్టు.శ్రమనే నమ్ముకుని ఎక్కిన బ్రతుకు మెట్టు.తల తెగిన తప్పని నీతి ఒట్టు.ఇబ్బందులు ఎన్ని ఎదురైనా విప్పని గుట్టు.ఇలా నిజాయితీకి మారుపేరుగా నిలిచిన.కష్టాలు ఎన్ని చుట్టుముట్టినా.
సమస్యలు ఎన్నో ఎదురైనా.
ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకునేవారు.
ఒకరికొకరు సహకరించుకునేవారు.
అందరి కోసం ఒకరు.. ఒకరికోసం అందరూ ఆ తరం కనుమరుగవుతున్నది.

Join WhatsApp

Join Now